Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

సవాళ్లకు కౌంటర్ జీవోలతో సమాధానం ఎమ్మెల్యే వేముల వీరేశం

09-02-2026 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ హీటెక్కిన రాజకీయ “దమ్ముంటే ఆలయానికి రా” అన్న సవాల్‌కు — ఫైళ్లతో, జీఓలతో సమాధానం

నిన్న, మొన్న పక్క పార్టీల నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించాయి. “దమ్ముంటే కనకదుర్గ అమ్మవారి ఆలయం దగ్గరకు రా… నువ్వు ఏం తెచ్చావో చూపించు” అంటూ చేసిన సవాల్‌కు అధికార పక్షం నేత గట్టి సమాధానం ఇచ్చారు.

“ఇదిగో… ఇవే మేము తెచ్చినవి” అంటూ పత్రాలు, జీఓలు బయటపెట్టారు.

పట్టణ అభివృద్ధి కోసం గత ఐదు సంవత్సరాల్లో చేసిన పనులపై వివరాలు వెల్లడించారు.

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం రూ. 15 కోట్ల నిధులు ప్రభుత్వం నుంచి తీసుకువచ్చామని, దీనికి సంబంధించిన జీఓలు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు.

నీటి శుద్ధి కార్యక్రమాల కోసం

రూ. 20 కోట్ల విలువైన ప్రపోజల్స్ ప్రభుత్వానికి సమర్పించామని చెప్పారు.

పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు

రూ. 12 కోట్లతో శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేశామని వెల్లడించారు.

సహాయ నిధులు – ప్రత్యక్ష మద్దతు

LOC ద్వారా రూ.75 లక్షలు,

ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.32 లక్షలు బాధితులకు అందించామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రతిపక్షాన్ని ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.“మేము ఐదు సంవత్సరాల్లో చేసినవి ఇవి… మీరు ఐదు సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా?” అంటూ సూటిగాప్రశ్నించారు.ప్రజాసమస్యలపై పోరాటం కాకుండా, దేవాలయాల పేరుతో రాజకీయాలు చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. అభివృద్ధి కనిపించాలంటే మాటల్లో కాదు, పనుల్లో కనిపించాలన్నారు.ఇప్పటికే ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.ప్రజలే ఎవరు పనిచేశారు, ఎవరు మాటలకే పరిమితమయ్యారో నిర్ణయిస్తారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Sthanikam

సవాళ్లకు కౌంటర్ జీవోలతో సమాధానం ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News