Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై లారీ ఢీ – రోడ్డు పక్కకు దూసుకెళ్లిన డీసీఎం స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ லஞ்ச் பாக்ஸுடன் செயலகத்திற்கு முதல்வர் விஜய்.. சாதாரண ஊழியரைப் போல புதிய பணிமுறை ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్ సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 16, 2026 05:36 PM

స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యంగా ధర్మవరంలో భారీ అవగాహన కార్యక్రమం

స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యంగా ధర్మవరంలో భారీ అవగాహన కార్యక్రమం

స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యంగా ధర్మవరంలో భారీ అవగాహన కార్యక్రమం
May 16, 2026 04:44 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

ధర్మవరం పట్టణంలోని కాలేజ్ సర్కిల్ వద్ద శనివారం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర – ప్లాస్టిక్ రహిత రాష్ట్రం అవగాహన కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కలిసి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి మరియు ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ పాల్గొని ప్రజలకు స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ మరియు ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ అవగాహన ఫ్లెక్సీ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ప్లాస్టిక్ వద్దంటే – నో చెప్పండి, ప్రకృతిని కాపాడండి అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు ప్రత్యక్షంగా వివరించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్వచ్ఛత ఆశయాలను సాకారం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణలో చారిత్రాత్మక మార్పుకు నాంది పలికిందన్నారు. దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగై, నీటి ద్వారా మరియు దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల రెండవ మరియు మూడవ శనివారాల్లో స్వచ్ఛత కార్యక్రమాలను ఉద్యమంలా నిర్వహిస్తున్నామని తెలిపారు. పరిశుభ్రత అనేది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాకుండా ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి జీవన విధానంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా మంత్రి గారు స్వయంగా ధర్మవరం పట్టణంలోని పలు దుకాణాలు, వీధి వ్యాపారులు, బండి దుకాణాల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరించారు. ప్లాస్టిక్ కవర్లను వాడకుండా ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా రోడ్డు పక్కన పూలు అమ్ముకునే ఒక మహిళా వ్యాపారస్తురాలు ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిరాకరించి పర్యావరణ హిత విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలుసుకుని మంత్రి ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఆమె సేవాభావాన్ని గుర్తిస్తూ అక్కడికక్కడే శాలువాతో ఘనంగా సన్మానించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్లాస్టిక్ వల్ల భూమి, నీరు మరియు గాలి తీవ్రంగా కలుషితమవుతున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా మనం ఉపయోగించే ఒక ప్లాస్టిక్ కవర్ భూమిలో పూర్తిగా కలవడానికి 16 నుంచి 20 సంవత్సరాలు పడుతుందని, ప్లాస్టిక్ బాటిల్స్ కరగడానికి 50 నుంచి 60 సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉందన్నారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల ప్రభావం కారణంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు భయంకరంగా పెరుగుతున్నాయని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 15.60 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, అందులో 8.75 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏటా 75 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఇప్పటికైనా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు. “మన పిల్లల భవిష్యత్తు కోసం ప్లాస్టిక్‌కు గుడ్‌బై చెప్పాల్సిన సమయం వచ్చింది” అని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన 85 లక్షల టన్నుల చెత్తను అలాగే వదిలేయకుండా, వేస్ట్ టు వెల్త్ విధానంలో సంపదగా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. భవిష్యత్తులో ప్లాస్టిక్ వినియోగాన్ని నేరంగా పరిగణించేలా చట్టపరమైన చర్యలు కూడా తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. అయితే చట్టాల కంటే ముందుగా ప్రజల్లో స్వచ్ఛంద మార్పు రావాలని, ముఖ్యంగా వ్యాపారులు, హోటళ్లు, స్ట్రీట్ వెండర్లు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని సూచించారు. మీడియా ప్రతినిధులు కూడా ప్రజల్లో నిరంతరం అవగాహన కల్పిస్తూ పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. పరిశుభ్రమైన సమాజం ద్వారానే ఆరోగ్యవంతమైన జీవితం సాధ్యం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ధర్మవరాన్ని ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం అని మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ... ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి కలుగుతున్న నష్టాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈసారి ప్రత్యేకంగా ప్లాస్టిక్ వినియోగ నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వల్ల భూమి, నీరు మరియు గాలి తీవ్రంగా కలుషితమవుతున్నాయని, దీని ప్రభావం ప్రజల ఆరోగ్యంపై దీర్ఘకాలికంగా పడుతోందని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వినియోగం ఒక అలవాటుగా మారిపోయిందని, ఇప్పుడు దానిని నియంత్రించడం ప్రతి పౌరుడి వ్యక్తిగత బాధ్యతగా మారిందన్నారు. ఈ కార్యక్రమాన్ని కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా, నెల రోజులపాటు క్షేత్రస్థాయిలో విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ, వార్డు స్థాయిలో ఉన్న మెడికల్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్లాస్టిక్ వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తారని వివరించారు. కార్యక్రమంలో భాగంగా ధర్మవరం పట్టణంలోని పలు స్ట్రీట్ వెండర్లను అధికారులు సందర్శించారు. ముఖ్యంగా పూలు అమ్ముకునే వ్యాపారులు కాగితపు కవర్లు ఉపయోగిస్తూ పర్యావరణ హిత విధానాన్ని అనుసరిస్తుండటం అభినందనీయమన్నారు. అయితే కొంతమంది బేకరీలు మరియు ఇతర వ్యాపార సంస్థలు ఇప్పటికీ ప్లాస్టిక్ కవర్లనే వినియోగిస్తున్నాయని, అలాంటి వారు వెంటనే ప్రత్యామ్నాయాల వైపు మారాలని సూచించారు.

ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఒక్కటే సరిపోదు. ముందుగా ప్రతి వ్యక్తిలో మార్పు రావాలి. వ్యక్తి మారితే సమాజం మారుతుంది. సమాజం మారితే మన పట్టణం, మన జిల్లా స్వచ్ఛంగా మారుతుంది” అని కలెక్టర్ పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News