Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:29 AM

సుధా బ్యాంకు ఆధ్వర్యంలో త్యాగరాజ ఉత్సవాలు అభినందనీయం

08-01-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కళలకు పుట్టినిల్లు సూర్యాపేట

సంగీతమే దైవానికి మార్గం : సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

సుధా బ్యాంకు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రశంసనీయం అని ప్రముఖ సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ అన్నారు. బుధవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన 23వ త్యాగరాజ ఆరాధనోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంగీతమే పరబ్రహ్మ స్వరూపమని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు త్యాగరాజ స్వామి అని పేర్కొన్నారు. శ్రీ సీతారామునిపై అపార భక్తితో, సంగీతాన్ని సాధనగా చేసుకుని దైవాన్ని చేరవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడిగా త్యాగరాజ స్వామిని కొనియాడారు. వేలాది కీర్తనలతో సంగీత ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడి జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా సుధా బ్యాంకు కళాకారులను గౌరవిస్తూ ఇలాంటి ఆధ్యాత్మిక–సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడం మంచి సంప్రదాయమని అభినందించారు. సూర్యాపేట కళలకు పుట్టినిల్లు అని పేర్కొన్నారు. సుధా బ్యాంకు చైర్మన్ మీలా మహదేవ్, మేనేజింగ్ డైరెక్టర్ పెద్ది రెడ్డి గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, ప్రముఖ రచయిత–జర్నలిస్ట్ పులగం చిన్నారాయణలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శాస్త్రీయ సంగీత గాత్ర కచేరిను ఎస్సీ కౌశిక్ కళ్యాణ్ బృందం ఆలపించగా, సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే మారుతి విద్యాసంస్థల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. అంతకుముందు సుధా బ్యాంకు కార్యాలయం నుంచి త్యాగరాజ స్వామి చిత్రపటానికి నివాళులర్పించి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుధా బ్యాంకు వైస్ చైర్మన్ కక్కిరేణి చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి రాజా, పొనుగోటి నిర్మల, మీలాసందీప్, సుజాత, భోనగిరి భాస్కర్, అప్పం శ్రీనివాస్, అనంతుల శారద, పటేల్ నర్సింహారెడ్డి, శశిధర్, ఈశ్వర్ కుమార్, ఏపూరి శ్రవణ్ కుమార్, బొలిశెట్టి మధు, వెంకట్ రెడ్డి, తోట శ్యాం ప్రసాద్, అంజన్ ప్రసాద్, మిర్యాల సుధాకర్, రాచకొండ శ్రీను, కొత్త ఆంజనేయులు, గాలి శీను, గుండా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సుధా బ్యాంకు ఆధ్వర్యంలో త్యాగరాజ ఉత్సవాలు అభినందనీయం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News