Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:47 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు ప్రాధాన్యత ఇస్తాం

స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు ప్రాధాన్యత ఇస్తాం

స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు ప్రాధాన్యత ఇస్తాం
December 28, 2025 06:18 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్వర్గీయ దామన్న చూపిన బాటలోనే యూత్ కాంగ్రెస్ కు అండగా ఉంటాం

యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

డిసిసి అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య


స్థానికం ప్రతినిధి బిక్షం

స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు ప్రాధాన్యత ఇస్తామని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్నాయుడు అధ్యక్షతన యూత్ కాంగ్రెస్ జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ, మాజీ మంత్రివర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని వారు చూపిన బాటలోనే మేము కూడా జిల్లాలో యూత్ కాంగ్రెస్ బలోపేతానికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ గుండెకాయ లాంటిదని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేలా పనిచేయాలని అన్నారు.


అనంతరం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ మాట్లాడుతూ జిల్లా కమిటీతో పాటు నియోజకవర్గ, మండల కమిటీలను సమన్వయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తామన్నారు. తనను యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా ప్రతిపాదించిన స్వర్గీయ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, తన గెలుపుకు విశేష కృషిచేసిన మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి , ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


అనంతరం ఇటీవల జరిగిన

సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచులుగా, ఉప సర్పంచ్ లుగా, వార్డు సభ్యులుగా విజయం సాధించిన యూత్ కాంగ్రెస్ నాయకులను సమావేశానికి ముఖ్యఅతిథులుగా హాజరైన యూత్ కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జులు వేలిమినేటి సురేష్, రమ్య కృష్ణ, సునీల్ లతో కలిసి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు.


ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కొమ్ము జవహర్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రావ్య సుధీర్ రెడ్డి, కందుకూరి అంబేద్కర్, సోషల్ మీడియాలో ఇంచార్జ్ రామడుగు నవీన్ చారి, విజయ భాస్కర్, అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ అజీమ్, జవీద్, పట్టణ అధ్యక్షులు బొడ్డు సాయి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ వినయ్, పవన్, సుదీర్, మండల అధ్యక్షులు వాలీ, అల్లేష్, శివ, సృజన్, సమీర్, గణేష్, మహేందర్, టీ సాయి, నాగరాజు, చెంచల నిఖిల్ నాయుడు, లక్మణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News