Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:56 PM

సత్యం, ధర్మం, పవిత్ర ఆలోచనల సమాహారమే రంజాన్...

21-03-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించిన నెల రంజాన్

మానవకోటికి ఇది మార్గదర్శకం

అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలిపే ఆనంద వేడుక రంజాన్

ముస్లిం సమాజానికి ఈద్ ముబారక్.. మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకట్ రత్నం బాబు.

సత్యం, ధర్మం, పవిత్ర ఆలోచనల సమాహారమే రంజాన్ అని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్‌ కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. శని వారం కోదాడ పట్టణం లోని సాలార్జంగ్ పేట ఈద్గా లో రంజాన్ పర్వ దినం ప్రార్థనల అనంతరం మునిసిపల్ వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లతో కలిసి ముస్లిం లకు ఈద్ ముబారక్ తెలిపి మాట్లాడారు.

పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించిన నెల రంజాన్ అని

మానవకోటికి ఇది మార్గదర్శకం అన్నారు.అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలిపే ఆనంద వేడుక రంజాన్ అన్నారు. ముస్లింల సంక్షేమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి ల సహకారం తో కృషి చేస్తామన్నారు. ఈద్గా, షాది ఖానా లకు మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి లు నిధులు మంజూరు చేశారన్నారు.

ముస్లిం సమాజానికి ఈద్ ముబారక్ తెలిపారు. కాగా పాలక వర్గం పక్షాన ముస్లిం ఈద్గా ప్రార్థనలకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లపట్ల ముస్లిం లు ఆనంద ఉత్సవాలు వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ చీమ నరేష్ బాబు, వైస్ ఛైర్మన్ మల్లీశ్వరి,కమిషనర్ రమాదేవి, మైనార్టీ నాయకులు అల్తాఫ్ హుస్సేన్, బాగ్దాద్, బాజాన్, అజీమ్, మధర్, సాహెబ్, ఫయాజ్, మునిసిపల్ పలు వార్డుల కౌన్సిలర్ లు,పాల్గొన్నారు.

Sthanikam

సత్యం, ధర్మం, పవిత్ర ఆలోచనల సమాహారమే రంజాన్...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News