Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:37 PM

స్త్రీ గౌరవం సమాజ అభివృద్ధికి పునాది. శ్రీ విద్య

07-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పొన్నేకల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పొన్నేకల్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో మహిళా అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ శ్రీ విద్య మాట్లాడుతూ స్త్రీ లేనిదే సృష్టి లేదని, స్త్రీ లేనిదే సమాజ ప్రగతి సాధ్యం కాదని పేర్కొన్నారు. చిన్నారిగా, సోదరిగా, భార్యగా, తల్లిగా అనేక పాత్రలు పోషిస్తూ కుటుంబ బాధ్యతలను భుజాన మోస్తున్న మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మహిళలకు విద్య, ఆత్మవిశ్వాసం, అవకాశాలు కల్పిస్తే వారు సమాజాన్ని ముందుకు నడిపించే శక్తిగా నిలుస్తారని అన్నారు.

కళాశాల కార్యనిర్వాహక సంచాలకురాలు డాక్టర్ సాయి గీతిక మాట్లాడుతూ నేటి మహిళలు విద్య, సాంకేతికత, వ్యాపారం వంటి అనేక రంగాల్లో విశేష విజయాలు సాధిస్తూ దేశ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. మహిళా దినోత్సవం కేవలం శుభాకాంక్షలు చెప్పుకునే రోజు మాత్రమే కాకుండా మహిళల హక్కులు, గౌరవాన్ని గుర్తుచేసుకునే రోజు అని తెలిపారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మహిళలు కుటుంబం, సమాజం, దేశ నిర్మాణంలో కీలక స్థానాన్ని కలిగి ఉన్నారని, విద్యార్థినులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా మహిళా సిబ్బంది, విద్యార్థినులను సన్మానించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కార్యక్రమంలో పరిపాలన అధికారి వైశాలి, డాక్టర్ జ్యోతి, డాక్టర్ ప్రణతి, పద్మజ, డీన్ డాక్టర్ వి. సుదర్శన్, శిక్షణా నియామక అధికారి డాక్టర్ రాజేష్, విద్యుత్ విభాగాధిపతి కృష్ణ ప్రసాద్, డాక్టర్ చార్యులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్త్రీ గౌరవం సమాజ అభివృద్ధికి పునాది. శ్రీ విద్య

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News