Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

హయత్‌నగర్ డిగ్రీ కాలేజీలో ఇంగ్లిష్ భాషా దినోత్సవం

Updated : 23 Apr 2026 20:10 IST
As Preferred Source 1 min read
హయత్‌నగర్ డిగ్రీ కాలేజీలో ఇంగ్లిష్ భాషా దినోత్సవం

హయత్‌నగర్,

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్‌నగర్‌లో ఇంగ్లిష్ శాఖ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ భాషా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థుల చురుకైన భాగస్వామ్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంగ్లిష్ భాష ప్రాముఖ్యతను వివరించారు.

ఈ సందర్భంగా వక్తృత్వం, చర్చా పోటీలను నిర్వహించగా విద్యార్థులు సమకాలీన అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచి మాట్లాడే నైపుణ్యం, విమర్శనాత్మక ఆలోచనను ప్రదర్శించారు. విజేతలకు, పాల్గొన్న వారికి పుస్తకాలు, పెన్నులు అందజేశారు.

కార్యక్రమంలో భాగంగా ఇంగ్లిష్ శాఖ, కెరీర్ గైడెన్స్ & ప్లేస్‌మెంట్ సెల్, తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ (టీఎస్‌కేసీ) కలిసి హైదరాబాద్ మలక్‌పేట్‌లోని వీసా ఐ20 ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి. దీని ద్వారా విద్యార్థులకు విదేశీ విద్య, కెరీర్ అవకాశాలపై మార్గదర్శనం లభిస్తుందని తెలిపారు.

ప్రిన్సిపాల్ పి. సురేష్‌బాబు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల భాషా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. ధర్మపురి మధు, ఇంగ్లిష్ శాఖాధిపతి డా. డి. మక్లా, డా. పి. విజయలక్ష్మి, పి. విద్యాసాగర్, డా. కృష్ణమోహన్, డా. ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హయత్‌నగర్ డిగ్రీ కాలేజీలో ఇంగ్లిష్ భాషా దినోత్సవం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి