Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 02:38 PM

కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్‌కు కొత్త షరతులు… వినియోగదారుల ఇబ్బందులు

21-04-2026 663 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని Canara Bank శాఖలో గోల్డ్ లోన్ తీసుకునే కస్టమర్లు ఇటీవల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు అత్యవసర అవసరాల కోసం బంగారం తాకట్టు పెట్టి సులభంగా రుణాలు పొందిన ప్రజలు, తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలతో ఇబ్బంది పడుతున్నట్లు వాపోతున్నారు.

ఇటీవల ఏప్రిల్ 1 నుండి Reserve Bank of India మార్గదర్శకాల ప్రకారం గోల్డ్ లోన్లపై కొన్ని కఠినమైన షరతులు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

₹10 లక్షల పైగా రుణం తీసుకునే వారికి ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరి చేశారు.

₹2.5 లక్షల పైగా లోన్ తీసుకునే వారు తమ ఆదాయ వనరులపై స్పష్టమైన వివరాలు ఇవ్వాల్సి వస్తోంది.

ప్రతి ₹1 లక్ష రుణానికి సుమారు ₹500 స్టాంప్ ఛార్జీలు విధిస్తున్నారని కస్టమర్లు చెబుతున్నారు.

ఈ నిబంధనలతో పాటు ప్రక్రియ ఆలస్యం, అదనపు పత్రాల సమర్పణ వంటి కారణాలతో గోల్డ్ లోన్ పొందడం కష్టంగా మారిందని బాధితులు తెలిపారు. తక్షణ అవసరాల కోసం బ్యాంకులను ఆశ్రయించే పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

స్థానికులు చెబుతున్నదేమంటే, బ్యాంకులు నియమాలు అమలు చేయడం అవసరమే అయినా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సడలింపులు ఇవ్వాలని కోరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు

Sthanikam

కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్‌కు కొత్త షరతులు… వినియోగదారుల ఇబ్బందులు

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News