Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:56 PM

‘స్థానికం’ వార్తతో లభించిన ఆచూకీ… కుటుంబంలో ఆనందం!

17-02-2026 235 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సోషల్ మీడియాలో అలజడి రేపిన కథనం… సురక్షితంగా రత్నమ్మ చేరిక

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం మాయికోడ్ గ్రామానికి చెందిన డి. రత్నమ్మ (58) కనిపించకుండా పోయిన ఘటనకు సుఖాంతం లభించింది.

నిన్నటినుంచి ఆమె ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఖేడ్ ప్రాంతం నుంచి నడుచుకుంటూ వెళ్లిన తర్వాత ఆమె కనిపించకపోవడంతో బంధువులు, గ్రామస్తులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఎలాంటి సమాచారం దొరకలేదు.

ఈ నేపథ్యంలో ‘స్థానికం పత్రిక’ లో ప్రచురితమైన వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ కావడంతో ప్రజల్లో చైతన్యం కలిగింది. అనేక మంది ఆ వివరాలను పంచుకోవడంతో విషయం వేగంగా వ్యాపించింది.

దీంతో ఆమెను గమనించిన వ్యక్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, రత్నమ్మ ఆచూకీ తెలిసింది.ఆమె సురక్షితంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

ఒక చిన్న సమాచారం కూడా ఒక కుటుంబానికి ఎంతటి ఆశాకిరణమో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ప్రజల స్పందనతో పాటు వార్తను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ‘స్థానికం’ పత్రిక పాత్ర ప్రశంసనీయమని గ్రామస్తులు అభినందించారు.

Sthanikam

‘స్థానికం’ వార్తతో లభించిన ఆచూకీ… కుటుంబంలో ఆనందం!

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News