Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

సర్పంచులు శిక్షణను సద్వినియోగం చేసుకుని గ్రామాభివృద్ధికి కృషి చేయాలి

22-02-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

పోచంపల్లి: మండల పరిధిలోని జలాల్‌పూర్‌లోని స్వామి రమనంద తీర్థ ఇన్స్టిట్యూట్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పాలనలో సర్పంచుల పాత్ర కీలకమైందని, ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ రాజు యాక్ట్ 2018 లోని అంశాలు,విధివిధానాలపై సర్పంచులు పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల అభివృద్ధి సర్పంచుల సమర్థ నాయకత్వంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లభించే నిధులను పారదర్శకంగా,సక్రమంగా వినియోగించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. పంచాయతీ రాజ్ చట్టంలో సర్పంచులకు కల్పించిన అధికారాలు, విధులు,బాధ్యతలను శిక్షణలో భాగంగా క్షుణ్ణంగా తెలుసుకోవాలని అన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో శానిటేషన్ నిర్వహణ,తాగునీటి సరఫరా వంటి అంశాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ముగిసిన సందర్భంగా సర్పంచులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీడీవోలు,ఎంపీవోలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

సర్పంచులు శిక్షణను సద్వినియోగం చేసుకుని గ్రామాభివృద్ధికి కృషి చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News