Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:47 AM

సర్పంచ్‌కు ఘన సన్మానం. బోగారం గెలుపే బీఆర్‌ఎస్ బలం: చిరుమర్తి లింగయ్య

16-12-2025 194 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బోగారం గెలుపే బీఆర్‌ఎస్ బలం: చిరుమర్తి లింగయ్య

స్థానికం రామన్న పేట ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో బీఆర్‌ఎస్ జెండా ఎగిరింది. గ్రామ సర్పంచ్‌గా బీఆర్‌ఎస్ అభ్యర్థి కూనూరి సాయికుమార్ గౌడ్ 410 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించడంతో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఘనంగా సన్మానించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సర్పంచ్‌కు శాలువా కప్పి పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా గెలుపులో కీలక పాత్ర పోషించిన అంతట రమేష్ సేవలను చిరుమర్తి లింగయ్య ప్రత్యేకంగా ప్రశంసించారు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా సర్పంచ్‌, నాయకులు కృష్ణ–అర్జునుల్లా కలిసి ముందుకు సాగాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కోరారు.అనంతరం సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచిన గ్రామ పెద్దలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బోగారం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

సర్పంచ్‌కు ఘన సన్మానం. బోగారం గెలుపే బీఆర్‌ఎస్ బలం: చిరుమర్తి లింగయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News