Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:42 PM

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి… ఘనంగా నివాళులర్పించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

02-04-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ త్యాగాలు, పోరాటస్ఫూర్తి తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ వారి సేవలను భవిష్యత్ తరాలకు చాటుతున్నామని, వారు నిర్మించిన కోటలను పర్యాటక మరియు పురావస్తు కేంద్రాలుగా అభివృద్ధి చేస్తూ చరిత్రను ప్రజలకు చేరువ చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు జిల్లా కలెక్టర్ మాధురి, అదనపు జిల్లా కలెక్టర్ (స్థానిక సంస్థలు) పాండు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

Sthanikam

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి… ఘనంగా నివాళులర్పించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

Article Image

రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ త్యాగాలు, పోరాటస్ఫూర్తి తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ వారి సేవలను భవిష్యత్ తరాలకు చాటుతున్నామని, వారు నిర్మించిన కోటలను పర్యాటక మరియు పురావస్తు కేంద్రాలుగా అభివృద్ధి చేస్తూ చరిత్రను ప్రజలకు చేరువ చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు జిల్లా కలెక్టర్ మాధురి, అదనపు జిల్లా కలెక్టర్ (స్థానిక సంస్థలు) పాండు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News