Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 02:25 AM

స్పర్శ్ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం

స్పర్శ్ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం

స్పర్శ్ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం
30-01-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

స్పర్శ్ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం

కోదాడ పట్టణంలోని స్థానిక కెఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని వివక్షను అంతం చేయడం గౌరవాన్ని కాపాడటం అనే నినాదంతో స్పర్శ్ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ పట్టణ డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ వి అమర్ కుమార్ హాజరయ్యి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కుష్టు వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, బాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది అని శరీరంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు కలిగి ఉండడం ఏమైనా లక్షణాలు ఉన్నట్లయితే స్థానిక ఆశా కార్యకర్తలకు ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇచ్చినట్లయితే వారిని గుర్తించి నిర్ధారణ అయినట్లయితే వారికి ఎండిటి చికిత్స విధానం ద్వారా వ్యాధిని నయంచేయవచ్చని తెలపడం జరిగింది. ఆరోగ్య సిబ్బంది ప్రతి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించే సమయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు సహకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ డా, హదసరాణి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవగాహనతో ఉండాలని అన్నారు.తదుపరి ఆరోగ్య సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా, చందా అప్పారావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా, నందిగామ నిర్మలకుమారి,పారా మెడికల్ సబ్ యూనిట్ ఆఫీసర్ సురేందర్, సీనియర్ అసిస్టెంట్ సునీల్, అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

స్పర్శ్ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News