Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:10 PM

సూర్యాపేటలో జనంబాట పోస్టర్ ఆవిష్కరణ..

సూర్యాపేటలో జనంబాట పోస్టర్ ఆవిష్కరణ..

సూర్యాపేటలో జనంబాట పోస్టర్ ఆవిష్కరణ..
30-12-2025 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham
జనవరి 3,4న కవిత పర్యటన
సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో జనవరి 3,4 తేదీల్లో నిర్వహించనున్న ‘జనంబాట’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు సూరారపు కృష్ణవేణి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జాగృతి ముఖ్య నాయకులతో కలిసి ‘జనంబాట’ గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనవరి 3న తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో, 4న కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో కల్వకుంట్ల కవిత విస్తృతంగా పర్యటించి ప్రజలతో నేరుగా మమేకం కానున్నారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులు, విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి అంశాలపై దృష్టి సారిస్తూ ఈ పర్యటన కొనసాగుతుందని వెల్లడించారు.

‘సామాజిక తెలంగాణ’ సాధనే లక్ష్యంగా చేపట్టిన జనంబాటకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యావంతులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, చందుల మధు, జితేందర్, సాయి గౌడ్, ఉమారాణి, సైదిరెడ్డి, నకిరెకంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేటలో జనంబాట పోస్టర్ ఆవిష్కరణ..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News