Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:25 AM

సూర్యాపేట మహాసభ కరపత్రం ఆవిష్కరణ

సూర్యాపేట మహాసభ కరపత్రం ఆవిష్కరణ

సూర్యాపేట మహాసభ కరపత్రం ఆవిష్కరణ
17-12-2025 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సూర్యాపేట మహాసభ కరపత్రం ఆవిష్కరణ

భువనగిరి, స్థానికం ప్రతినిధి:

జనవరి 4న సూర్యాపేటలో జరగనున్న తెలంగాణ ఉద్యమకారుల మహాసభల కరపత్రాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు బాకారం లావణ్య బుధవారం భువనగిరిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా సలహాదారులు బట్టు రామచంద్రయ్యతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బాకారం లావణ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు తక్షణమే గుర్తింపు కార్డులు జారీ చేయాలని, ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల స్థలం కేటాయించి నాలుగు గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా “తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు” ఏర్పాటు చేయాలన్నారు.

జనవరి 4న సూర్యాపేటలో నిర్వహించే మహాసభలకు ఉద్యమకారులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సమాఖ్య యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు రత్నపురం పద్మ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు భాస్కర్ నాయక్, రాణి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేట మహాసభ కరపత్రం ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News