Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:06 AM

సూరేపల్లి వాసి సాలి ధనావత్‌కు డాక్టరేట్… బంజారా మౌఖిక సాహిత్యంపై విశేష పరిశోధన

18-12-2025 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సూరేపల్లి వాసి సాలి ధనావత్‌కు డాక్టరేట్… బంజారా మౌఖిక సాహిత్యంపై విశేష పరిశోధన

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

భువనగిరి మండలం సూరేపల్లి గ్రామ పరిధిలోని ఆకుతోటి బావి తండాకు చెందిన సాలి ధనావత్ ప్రతిష్టాత్మక ఘనత సాధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ (పీహెచ్‌డీ) పట్టాను ఆమె సొంతం చేసుకున్నారు.

బంజారా మౌఖిక సాహిత్యంపై విస్తృతమైన పరిశోధన చేసినందుకు గాను డాక్టరేట్ ప్రదానం చేసినట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం అధికారికంగా ప్రకటించింది. యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఏలె విజయలక్ష్మి పర్యవేక్షణలో “యాదాద్రి జిల్లా బంజారా మౌఖిక కథలు – సమగ్ర అధ్యయనం” అనే అంశంపై ఆమె పరిశోధన నిర్వహించారు.

ఈ సందర్భంగా తనను శిష్యవాత్సల్యంతో ప్రోత్సహించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు కాశీం, కమలాకర శర్మ, సూర్య ధనంజయ్, డాక్టర్ ఎస్. రఘు లకు సాలి ధనావత్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే డాక్టరేట్ సాధనలో నిరంతరం తోడుగా నిలిచిన భర్త కెతావత్ మురళీ నాయక్, అత్తమ్మ కేతావత్ చాయమ్మ, మామయ్య నర్సింహలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

డాక్టరేట్ పట్టా సాధించిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు సాలి ధనావత్‌ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. బంజారా సంస్కృతి, సాహిత్యానికి ఆమె చేసిన కృషి యువ పరిశోధకులకు మార్గదర్శకంగా నిలుస్తుందని పలువురు ప్రశంసించారు.

Sthanikam

సూరేపల్లి వాసి సాలి ధనావత్‌కు డాక్టరేట్… బంజారా మౌఖిక సాహిత్యంపై విశేష పరిశోధన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News