Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

సానుభూతి కాదు… సేవకు అవకాశం ఇవ్వండి

సానుభూతి కాదు… సేవకు అవకాశం ఇవ్వండి

సానుభూతి కాదు… సేవకు అవకాశం ఇవ్వండి
05-02-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్ కాలనీ అభివృద్ధి కోసం జయపాల్ రెడ్డి చేసిన కృషి స్థానికులకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. ప్రాంతం మంచి భవిష్యత్తు సాధించాలనే ఆశతో ఆయన ఎన్నో ఆలోచనలు, ప్రణాళికలు రూపొందించారు. ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకు సాగిన ఆయన,2019 లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.అనంతరం,2021 లో జయపాల్ రెడ్డి అకాలంగా కన్నుమూయడంతో ప్రాంత ప్రజల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఆయన కలలు మాత్రం ప్రజల మనసుల్లో జీవించుతూనే ఉన్నాయి.ఆ కలలను సాకారం చేయాలనే సంకల్పంతో ఈ రోజు ఆయన కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. జయపాల్ రెడ్డి భార్య గోపిరెడ్డి రంజిత రెడ్డి, ఆయన అన్న సునీల్ రెడ్డి ప్రజాసేవ పంథాను కొనసాగించాలని నిర్ణయించారు. కాలనీ అభివృద్ధికి అంకితభావంతో సేవ చేయాలనే లక్ష్యంతో, రాబోయే పురపాలక ఎన్నికల్లో గోపిరెడ్డి రంజిత రెడ్డి సభ్యురాలిగా పోటీ చేస్తున్నారు.ఇలాంటి సమయంలో జయపాల్ రెడ్డి కుటుంబానికి ప్రజల మద్దతు కీలకంగా మారింది. ప్రజల సహకారం లభిస్తే, పరిధి16 అభివృద్ధి దిశగా మరింత ముందడుగు పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సాగిన జయపాల్ రెడ్డి ఆశయాలు కొనసాగాలన్న ఆకాంక్ష స్థానికుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Sthanikam

సానుభూతి కాదు… సేవకు అవకాశం ఇవ్వండి

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News