Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:56 PM

సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: పరమానంద దాస్

28-05-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

సనాతన ధర్మాన్ని ముందుతరాలకు చేరవేసే బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని ఇస్కాన్ టెంపుల్ హిందూ ధర్మకర్త పరమానంద దాస్ పేర్కొన్నారు. గురువారం చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ తిరుమలనాథ దేవస్థానాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులతో సమావేశమయ్యారు.

భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం, ఆలయాల ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి చిన్నారులకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పరమానంద దాస్ అన్నారు. సనాతన ధర్మ విలువలను పరిరక్షిస్తూ, వాటిని భావితరాలకు అందించడం సమాజ బాధ్యతగా ప్రతి హిందువు భావించాలని సూచించారు.ఆలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలకు కేంద్ర బిందువులని ఆయన పేర్కొన్నారు. యువతలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించేందుకు కుటుంబాలు, గురువులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు భగవద్గీత ప్రతులను అందజేశారు.కార్యక్రమంలో శివప్రసాద్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, కురు యాదయ్య, మర్రి హరీష్ రెడ్డి, ఎరుపుల నరసింహ, ఎరుపుల వెంకన్న, దేవాలయ అర్చకులు అమరేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: పరమానంద దాస్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News