Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:46 AM

సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమ కేసులో కీలక పరిణామం: ఎండీ అరెస్ట్ – ఎస్పీ పరితోష్ పంకజ్

28-12-2025 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమ అగ్ని ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి

పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో ఇటీవల సంభవించిన ఘోర అగ్ని ప్రమాద ఘటనపై భానూర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 184/2025గా కేసు నమోదు చేశారు. ఈ కేసును BNS సెక్షన్లు 105, 110, 118(1), 118(2) ప్రకారం నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టిన పోలీసులు, పరిశ్రమ భద్రతా నిబంధనల ఉల్లంఘన, నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా నిర్ధారించారు. దర్యాప్తులో భాగంగా సిగాచి పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమిత్ రాజ్ సిన్హాను నిందితుడిగా గుర్తించారు.

ఈ క్రమంలో నిన్న తేది 27.12.2025 సాయంత్రం అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేసి, అనంతరం గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయస్థానం ఆయనను 14 రోజుల జుడీషియల్ రిమాండ్కు పంపుతూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ విషయాలను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ మీడియాకు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు, బాధ్యుల పాత్రపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. పరిశ్రమల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు.

ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొనగా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు తెలిపారు.

Sthanikam

సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమ కేసులో కీలక పరిణామం: ఎండీ అరెస్ట్ – ఎస్పీ పరితోష్ పంకజ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News