Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:19 PM

సమస్త రైతు సోదరులకు, జిల్లా ప్రజలకు బోగీ పండగ శుభాకాంక్షలు

14-01-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కొత్త జీవితానికి నాంది పలకాలి – ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలి

వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సమస్త రైతు సోదరులకు, జిల్లా ప్రజలకు బోగీ పండగ శుభాకాంక్షలు అని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు, ప్రజలు అందరూ సుఖసంతోషాలతో బోగీ వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త జీవితానికి నాంది పలికే బోగీ పండగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి సౌఖ్యాలు తీసుకురావాలని కోరారు. రైతు సోదరులతో పాటు వ్యవసాయ మార్కెట్ సిబ్బంది, కమిషన్ దారులు, ఖరీదుదారులు, మిల్లర్లు, హమాలీలు, దడువయిలు, గుమస్తాలు, వ్యాపారస్తులు, పుర ప్రముఖులు, శ్రేయోభిలాషులు అందరికీ బోగీ శుభాకాంక్షలు తెలిపారు.

భోగి మంటల వెనుక శాస్త్రీయ, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని కొప్పుల వేణారెడ్డి తెలిపారు. పురాణాల ప్రకారం వామన అవతారంలో భగవంతుడు బలి చక్రవర్తిని పాతాళానికి రాజుగా నియమించి, సంక్రాంతి పండుగకు ముందు భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించాలని వరం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అందుకే సంక్రాంతి పండుగకు ముందు రోజు బలి చక్రవర్తికి ఆహ్వానం పలికేందుకు భోగి మంటలు వేస్తారని వివరించారు.

గతంలో ఎదురైన కష్టనష్టాలు, బాధలు, చెడు అలవాట్లను భోగి మంటల్లో తగలబెట్టి, భౌతికంగా, ఆధ్యాత్మికంగా శుద్ధి పొంది కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడమే భోగి పండుగ సారాంశమని ఆయన తెలిపారు. దక్షిణాయణంలో ఎదురైన కష్టాలను అగ్నిదేవుడికి సమర్పించి, రాబోయే ఉత్తరాయణంలో సానుకూల శక్తితో, సుఖసంతోషాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రైతులు, ప్రజలు అందరూ సంతోషంగా, ఐక్యతతో బోగీ పండగను జరుపుకోవాలని కోరుతూ మరోసారి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

సమస్త రైతు సోదరులకు, జిల్లా ప్రజలకు బోగీ పండగ శుభాకాంక్షలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News