Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:39 AM

సమాన పనికి -సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్

సమాన పనికి -సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్

సమాన పనికి -సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్
May 18, 2026 10:02 PM 190 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ,బీసీ,గురుకుల హాస్టళ్లలో పనిచేస్తున్న నాలుగవ తరగతి ఉద్యోగులు అనగా స్వీపర్లు, వాచ్‌మెన్‌లకు ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో ఆ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోటకొండ కృష్ణప్ప, జిల్లా అధ్యక్షులు ఎం.మల్లేష్ తదితర నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టళ్లలో రాత్రింబవళ్లు పనిచేస్తున్న పేద స్వీపర్లు, వాచ్‌మెన్‌లకు 5 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న నిబంధనను రాష్ట్ర ప్రభుత్వమే తుంగలో తొక్కుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్ జీతాలు విడుదల చేయకపోతే ఆందోళన బాట పడతామని హెచ్చరించారు.

*మే 30న జిల్లాస్థాయి సమావేశానికి పిలుపు*

అదేవిధంగా మే 30వ తేదీన పుట్టపర్తిలోని బీసీ బాయ్స్ హాస్టల్‌ నందు నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేష్ తెలిపారు. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్న వర్కర్లు అందరూ ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏపీ 4వ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇదాయతుల్లా, వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News