Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:24 AM

సమాన విద్య అందించడంలో అంబేద్కర్ యూనివర్శిటీ ముందుంది న్యాక్ డైరెక్టర్ ప్రొ. గణేశన్ కన్నాభిరాన్

14-05-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, న్యూస్‌టుడే:

డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ అన్ని వర్గాలకు సమాన విద్యా అవకాశాలు కల్పించడంలో విశేష కృషి చేస్తోందని న్యాక్ డైరెక్టర్ ప్రొ. గణేశన్ కన్నాభిరాన్ ప్రశంసించారు.

విద్యా వారోత్సవాల్లో భాగంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, అంతర్గత నాణ్యత హామీ విభాగం (IQAC), జాతీయ అధ్యయన గుర్తింపు మండలి (NAAC), కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL) సంయుక్త ఆధ్వర్యంలో “న్యాక్‌తో విద్యాపరమైన సంభాషణ” అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న జాతీయ స్థాయి వర్క్‌షాప్ ఏర్పాట్లను ప్రొ. గణేశన్ కన్నాభిరాన్ సమీక్షించారు. నాణ్యతా హామీ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడమే వర్క్‌షాప్ లక్ష్యమని తెలిపారు.

అనంతరం విశ్వవిద్యాలయ డీన్లు, డైరెక్టర్లతో సమావేశమై శాఖల ప్రామాణిక కార్యాచరణ విధానాలపై చర్చించారు. సమ్మిళిత విద్యకు అంబేద్కర్ యూనివర్శిటీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ విద్యా నాణ్యత పెంపు కోసం పలు సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆదివాసీ, గిరిజన విద్యార్థులు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు ఉచిత విద్య అందించడంతో పాటు కార్పొరేట్ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చి విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి, రిజిస్ట్రార్ డా. విజయకృష్ణారెడ్డి, ప్రొ. పల్లవి కబ్డే, ఓఎస్డీ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్, ప్రొ. ఐ. ఆనంద్ పవార్, డా. వై. వెంకటేశ్వర్లు, ప్రొ. రజనీ, ప్రొ. చంద్రకళ, ప్రొ. రాణి రజిత మాధురి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సమాన విద్య అందించడంలో అంబేద్కర్ యూనివర్శిటీ ముందుంది న్యాక్ డైరెక్టర్ ప్రొ. గణేశన్ కన్నాభిరాన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News