Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

సమ్మక్క–సారలమ్మ గద్దెల సందర్శన… నలంద విద్యార్థులు

09-03-2026 125 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నలంద డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎడ్యుకేషనల్ టూర్‌లో భాగంగా మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెలను సందర్శించారు. రాజుల అధిక శిస్తుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి గిరిజనుల ఆత్మాభిమానాన్ని చాటుతూ పోరాటంలో అమరులైన వీరవనితలు సమ్మక్క, సారలమ్మల త్యాగాలను ఈ సందర్భంగా విద్యార్థులు స్మరించుకున్నారు.సుమారు 1200 సంవత్సరాల క్రితం అడవి బిడ్డలు చేసిన త్యాగాల చరిత్రను నేటి తరం విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఎడ్యుకేషనల్ టూర్‌ను నిర్వహించినట్లు కళాశాల యాజమాన్యం పేర్కొంది. మేడారం చరిత్రను వివరిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాసనాలను, సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల చరిత్రను విద్యార్థులు ఆసక్తిగా తెలుసుకున్నారు. చిక్కలగుట్ట ప్రాంతం, మేడారం అడవిని ప్రత్యక్షంగా సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. అలాగే కాకతీయులు తవ్వించిన లక్నవరం చెరువును సందర్శించి దాని ప్రాధాన్యతను తెలుసుకున్నారు. నీటిపారుదల కోసం కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థపై అవగాహన పొందారు. అనంతరం కాకతీయులు నిర్మించిన ఐనవోలు మల్లన్న దేవాలయాన్ని సందర్శించారు.వందల ఏళ్ల చరిత్ర కలిగిన చారిత్రాత్మక ప్రాంతాలను పుస్తకాలలో మాత్రమే చదివామని, ఈ ఎడ్యుకేషనల్ టూర్ ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్, వైస్ ప్రిన్సిపాల్ చిలువేరు దుర్గయ్య, డైరెక్టర్ కట్టెల లింగస్వామి, అధ్యాపకులు కడగంచి రాములు, నాగలక్ష్మి, మహేష్, సువర్ణ, శ్రీదేవి, బాలరాజు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

సమ్మక్క–సారలమ్మ గద్దెల సందర్శన… నలంద విద్యార్థులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News