Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:27 AM

సామాజిక వివక్షత లేని సమాజమే సుందరయ్యకు నిజమైన నివాళి

19-05-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎర్రుపాలెం,

అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా ఎర్రుపాలెం మండల కేంద్రంలోని కామ్రేడ్ రామిశెట్టి పుల్లయ్య భవన్‌లో సీపీఎం నేతలు ఘనంగా నివాళులర్పించారు.

సుందరయ్య చిత్రపటానికి సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య, మండల కార్యదర్శి మద్దల ప్రభాకరరావు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ సామాజిక వివక్షత, దోపిడీ లేని సమాజ నిర్మాణం కోసం సుందరయ్య జీవితాంతం పోరాడారని పేర్కొన్నారు.

శ్రమజీవుల హక్కులు, పేదల ఆత్మగౌరవం కోసం రాజీలేని పోరాటాలు చేసిన మహానేత సుందరయ్య అని కొనియాడారు. “దున్నేవానికి భూమి” నినాదంతో లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత కమ్యూనిస్టు ఉద్యమానిదని తెలిపారు.

నేటి సమాజంలో పెరుగుతున్న దోపిడీ, అసమానతలపై మరింతగా పోరాటాలు అవసరమని, పేదల సంక్షేమం, నవ సమాజ నిర్మాణం కోసం సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.

కార్యక్రమంలో దూదిగం బసవయ్య, నక్క పుల్లారావు, తాళ్లూరి వెంకటనారాయణ, కోటి సుబ్బారెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సామాజిక వివక్షత లేని సమాజమే సుందరయ్యకు నిజమైన నివాళి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News