Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:22 AM

సమాజ సేవలో నర్సుల త్యాగం మరువలేనిది – బైండ్ల కృష్ణ

12-05-2026 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ సమక్షంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై పండరి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల్, న్యాల్‌కల్ మండల అధ్యక్షులు నవీన్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆసుపత్రి నర్సులను శాలువాలతో సన్మానించి అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ మాట్లాడుతూ నర్సులు వైద్య రంగానికి వెన్నెముకలాంటివారని, రోగుల ఆరోగ్య పరిరక్షణలో వారు అందిస్తున్న సేవలు అమూల్యమని కొనియాడారు. పగలు రాత్రి తేడా లేకుండా ప్రజలకు సేవ చేస్తున్న ప్రతి నర్సు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు.కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి నర్సులు విజయ కుమారి , లక్ష్మమ్మ,శంకరమ్మ మౌనిక, పుష్ప, వెంకట్ లక్ష్మీ ,సీనియర్ జర్నలిస్టులు విఠల్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సమాజ సేవలో నర్సుల త్యాగం మరువలేనిది – బైండ్ల కృష్ణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News