Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:48 PM

సమాజ హితానికి కృషి చేసిన ఖేడ్ లయన్స్‌కు ఘనమైన అభినందనలు

22-02-2026 283 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ ప్రాంతంలో సేవా కార్యక్రమాలతో విశేష గుర్తింపు పొందిన లయన్స్ క్లబ్ నారాయణఖేడ్ మరోసారి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకుంది. సమాజ హితాన్ని లక్ష్యంగా పెట్టుకుని నిరంతరం కంటి చికిత్సా శిబిరాలు, ఉచిత కంటి ఆపరేషన్లు, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస శిక్షణా శిబిరాలు వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ఈ క్లబ్‌కు 2025–26 సంవత్సరానికి గాను ప్రత్యేక అవార్డులు ప్రదానం చేశారు.హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ ఎంపవర్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో ఈ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ, సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న సేవా దృక్పథాన్ని కొనియాడారు.అదేవిధంగా పాఠశాలల్లో విద్యా సామాగ్రి పంపిణీ, ప్రతి వారం నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందజేత, అనేక రక్తదాన శిబిరాల నిర్వహణతో పాటు స్వయంగా 65వ సారి రక్తదానం చేసి సేవాస్ఫూర్తిని చాటిన 320D డిస్ట్రిక్ట్ చైర్మన్ చంద్ర శేఖర్ ఆచార్య ప్రత్యేక అవార్డు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబూరావు మరియు గవర్నర్ నాగేష్ పంపాటి మాట్లాడుతూ, ఖేడ్ లయన్స్ క్లబ్ జిల్లా స్థాయిలోనే అత్యుత్తమ సేవలు అందించిన సంస్థగా నిలిచిందని అభినందించారు. క్లబ్ అధ్యక్షుడు వెంకట్ రావు మ,కార్యదర్శి జైపాల్ రెడ్డి, కోశాధికారి మల్లేశంలకు ఉత్తమ సేవ పురస్కారాలు అందజేశారు.సమాజంలో అణగారిన వర్గాలకు అండగా నిలుస్తూ, ఆరోగ్యం–విద్య–సేవా రంగాల్లో నిరంతర కృషి చేస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులందరికీ ఈ అవార్డులు ప్రోత్సాహకరంగా నిలిచాయి. భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో సేవా కార్యక్రమాలు కొనసాగించి, నారాయణఖేడ్ ప్రాంతాన్ని సేవా రంగంలో ఆదర్శంగా నిలబెట్టాలని క్లబ్ సభ్యులు సంకల్పించారు.సేవే మాధవ సేవ అనే నినాదాన్ని ఆచరణలో పెట్టిన ఖేడ్ లయన్స్ క్లబ్‌కు ప్రాంత ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.మ

Sthanikam

సమాజ హితానికి కృషి చేసిన ఖేడ్ లయన్స్‌కు ఘనమైన అభినందనలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News