Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:10 AM

సిరిపురంలో రైతుల ఆందోళన

సిరిపురంలో రైతుల ఆందోళన

సిరిపురంలో రైతుల ఆందోళన
05-01-2026 1,538 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అర్ధాంతర వంతెనతో వ్యవసాయ రాకపోకలకు విఘాతం

రామన్నపేట స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో సోమవారం రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. సిరిపురం నుంచి పెద్ద కాపర్తి వెళ్లే మార్గంలో కొనసాగుతున్న ధర్మారెడ్డి పల్లి కాల్వ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న వంతెన ప్రమాణాలకు తగిన విధంగా లేదని రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.కాల్వపై నిర్మిస్తున్న వంతెనకు అవసరమైన ఎత్తు లేకపోవడంతో పాటు రోడ్డుకు సంబంధించిన క్రాసింగ్‌ను సరిగా డిజైన్ చేయలేదని రైతులు ఆరోపించారు.

గ్రామ రైతులను సంప్రదించకుండా కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కాల్వ వద్ద ధర్నాకు దిగారు.ఇలాగే పనులు కొనసాగితే వ్యవసాయ భూములకు వెళ్లే రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని వంతెన ఎత్తును పెంచడంతో పాటు క్రాసింగ్ వద్ద లెవెల్ సెట్ చేసి నిర్మాణాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు. సమస్యలను పట్టించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ ఆందోళనలో ఉప సర్పంచ్ మూడు దుడ్ల అనుష రమేష్‌తో పాటు కూనూరి ముత్తయ్య, బండ శ్రీనివాస్ రెడ్డి, ఏళ్ల సంజీవరెడ్డి, గుంటూజి కృష్ణమాచారి, బల్గూరి అంజయ్య, ఏళ్ల వెంకట నరసయ్య, కట్ట శేఖర్ రెడ్డి, బెడద రమేష్, నర్రా నర్సిరెడ్డి, ఏళ్ల మల్లారెడ్డి, గజం సత్యనారాయణ, మోటి మల్లేశం వడ్లపల్లి శ్రీనివాస్, పొట్ట బత్తుల వెంకటేష్, అప్పం వెంకటేష్, దూలం రవి, పబ్బు మల్లయ్య, దయ్యాల శ్రీశైలం, మోటి రాము తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సిరిపురంలో రైతుల ఆందోళన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News