Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:14 AM

సిరిపురంలో బీజేపీ శక్తి ప్రదర్శన విస్తృత స్థాయి సమావేశం, పార్టీలో చేరికలు

04-01-2026 313 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సిరిపురంలో బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం

రాష్ట్ర నాయకుల హాజరు, 25 మంది పార్టీలో చేరిక

రామన్నపేట స్థానికం ప్రతినిధి

బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సిరిపురం గ్రామంలో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఉత్సాహంగా జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై, గ్రామ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా దాసరి మల్లేశం మాట్లాడుతూ, రేపు జరగబోయే MPTC ఎన్నికల్లో గతంలో మాదిరిగానే బీజేపీ–బీఆర్‌ఎస్ కలిసి పనిచేసి విజయాన్ని సాధించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి కేడర్ కీలకమని, గ్రామస్థాయిలో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన 25 మంది నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. బీజేపీ మండల నాయకులు బండ మధుకర్ రెడ్డి, కన్నెకంటి వెంకటేశ్వరాచారి, మొగిలయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.సిరిపురం గ్రామ బీజేపీ–బీఆర్‌ఎస్ నాయకులు ఏళ్ల సంజీవ రెడ్డి, రాపోలు స్వామి, జె.లక్ష్మీనారాయణ, బండ శ్రీనివాస్ రెడ్డి, పున్న వెంకటేశం, కే.ముత్తయ్యతో పాటు గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ మూడుదుడ్ల అనూష రమేష్, వార్డు సభ్యులు గాదె శంకర్, కె.రమేష్, పి.లక్ష్మి, కట్ట భాను సతీష్ రెడ్డి, జీ.కృష్ణమాచారి, వెల్లంకి ఉపసర్పంచ్ రాజ్‌కుమార్, బీజేపీ నాయకులు ఎం.ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. మొత్తం దాదాపు వందమంది బీజేపీ క్రియాశీలక కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు.

ఈ సమావేశంలో బీజేపీ సిరిపురం గ్రామ శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఏలే వెంకట నర్సయ్యను, ప్రధాన కార్యదర్శిగా గజం సత్యనారాయణను ఎంపిక చేశారు. రాబోయే రోజుల్లో పార్టీని గెలుపు బాటలో నడిపించాలనే తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది.

Sthanikam

సిరిపురంలో బీజేపీ శక్తి ప్రదర్శన విస్తృత స్థాయి సమావేశం, పార్టీలో చేరికలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News