Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:33 PM

సైన్స్ తో సమాజ అభివృద్ధి ఎంఈఓ సైదా నాయక్

సైన్స్ తో సమాజ అభివృద్ధి ఎంఈఓ సైదా నాయక్

సైన్స్ తో సమాజ అభివృద్ధి ఎంఈఓ సైదా నాయక్
January 28, 2026 07:51 PM 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

చిట్యాల మండలంలో ఫోరమ్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఆధ్వర్యంలో మండల స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిట్యాల మండల విద్యాధికారి గుగులోతు సైదా నాయక్ ప్రశ్నాపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో సైన్స్ కీలక పాత్ర పోషిస్తుందని, సైన్స్ నిత్య జీవితంలో భాగమని తెలిపారు. విద్యార్థులు సైన్స్‌ను శ్రద్ధతో నేర్చుకొని నూతన ఆవిష్కరణల వైపు దృష్టి సారించాలని సూచించారు.

ఈ టాలెంట్ టెస్ట్‌లో జడ్పిహెచ్ఎస్ నేరడ పాఠశాలకు చెందిన మిరియాల సంయుక్త ప్రథమ బహుమతి, జడ్.పి.హెచ్.ఎస్ పెద్దకాపర్తి పాఠశాలకు చెందిన బత్తుల శశాంక్ ద్వితీయ బహుమతి సాధించారు. విజేతలకు ఎంఈఓ బహుమతులు అందజేశారు. మండల స్థాయిలో విజయం సాధించిన విద్యార్థులు జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్‌కు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫిజికల్ సైన్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు వీరమల్ల నాగయ్య, కోఆర్డినేటర్లు బిక్షం రెడ్డి, యశోద రెడ్డి, చిట్యాల జడ్.పి.హెచ్.ఎస్ ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు చిలక రాజు శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News