నారాయణపేట, జనవరి 4 స్థానిక ప్రతినిధి
నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం చర్చ్ ప్రాంగణంలో డాక్టర్ కె. రాజ్‌కుమార్ రెడ్డి బోరు మోటార్‌ను ప్రారంభించారు. ఈ బోరు ద్వారా చర్చ్ పరిసర ప్రాంత ప్రజలతో పాటు గ్రామస్తులకు తాగునీటి సౌకర్యం మెరుగవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామస్తులు హర్షాతిరేకాలతో స్వాగతించి అభినందించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని డా. రాజ్‌కుమార్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో నాగేష్ పాస్టర్, అరుణ్ (ఏఎస్ఐ), లక్ష్మప్ప, ఉప సర్పంచ్‌తో పాటు ఫౌండేషన్ సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి