Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:35 PM

సగం ధరకు ఇండక్షన్ స్టవ్‌లు… స్వచ్ఛ రథాలకు శ్రీకారం

01-04-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జరిగిన కార్యక్రమంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. గ్యాస్ కొరతపై వస్తున్న వార్తలు పుకార్లేనని, ఎప్పటిలాగే ఇండెంట్ పెట్టిన వారికి సకాలంలో సిలిండర్లు అందుతాయని స్పష్టం చేశారు.

మధ్యప్రాచ్య పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇండక్షన్ స్టవ్‌లను సగం ధరకే ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు.

అదే సమయంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చెత్త నుంచి సంపద సృష్టించే విధానాన్ని అమలు చేస్తున్నామని, స్వచ్ఛ రథాల ద్వారా చెత్త ఇచ్చి నిత్యావసర సరుకులు పొందే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు.

ఈ సందర్భంగా కొందరు లబ్ధిదారులకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేసి, స్వచ్ఛ రథాలను మంత్రి సవిత ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

సగం ధరకు ఇండక్షన్ స్టవ్‌లు… స్వచ్ఛ రథాలకు శ్రీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News