Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 09:44 PM

సాగర్ శెట్కార్ గెలుపు కోసం కాంగ్రెస్ శ్రేణుల విస్తృత ప్రచారం

06-02-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణఖేడ్ మున్సిపాలిటీ 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాగర్ శెట్కార్ గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచార కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ శెట్కార్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ శెట్కార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల జీవన స్థాయిని మెరుగుపరిచేందుకు చేసిన కృషిని ప్రజలకు వివరించారు. వార్డులో రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. ప్రజల సమస్యలు వినడమే కాకుండా వాటికి పరిష్కారం చూపే పార్టీ కాంగ్రెస్ పార్టీనే అని స్పష్టంగా చెప్పారు.ప్రజల నమ్మకాన్ని బలంగా నిలుపుకుంటూ, ప్రతి ఇంటికి చేరువై సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని అభ్యర్థి సాగర్ శెట్కార్ తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షుడు సాయిలు పటేల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

సాగర్ శెట్కార్ గెలుపు కోసం కాంగ్రెస్ శ్రేణుల విస్తృత ప్రచారం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News