Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:58 AM

సీపీఐ యాదాద్రి జిల్లా నాయకుడు బోడ సుదర్శన్ ఆకస్మిక మృతి

23-12-2025 122 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సీపీఐ యాదాద్రి జిల్లా నాయకుడు బోడ సుదర్శన్ ఆకస్మిక మృతి

సీపీఐ యాదాద్రి జిల్లా నాయకుడు బోడ సుదర్శన్ గుండెపోటుతో మృతి

స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా సీపీఐ నాయకుడు, వేములకొండ–వెంకటాపురం ప్రాంతాలకు చెందిన కామ్రేడ్ బోడ సుదర్శన్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతితో కమ్యూనిస్టు శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, అనుచరుల్లో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది.

పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన బోడ సుదర్శన్ ప్రజాసమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండేవారు. కార్మికులు, రైతుల హక్కుల కోసం సాగిన ఉద్యమాల్లో కీలకంగా పనిచేశారు. ఆయన సేవలు సీపీఐకు, ప్రజా ఉద్యమాలకు చిరస్మరణీయమని పార్టీ నేతలు కొనియాడారు.

కామ్రేడ్ బోడ సుదర్శన్ మృతికి సీపీఐ నాయకులు, కార్యకర్తలు జోహార్లు అర్పిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Sthanikam

సీపీఐ యాదాద్రి జిల్లా నాయకుడు బోడ సుదర్శన్ ఆకస్మిక మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News