Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:28 AM

సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలి

08-01-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాలలో బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ

చిట్యాల స్థానికం ప్రతినిది ప్రశాంత్

ఖమ్మంలో జనవరి 18న నిర్వహించనున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభను లక్షలాది మంది పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ లొడంగి శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా చిట్యాల పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డులో సీపీఐ మండల శాఖ ఆధ్వర్యంలో బహిరంగ సభ వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) భారతదేశ స్వాతంత్ర్యానికి ముందే ఆవిర్భవించి, దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని మొదటగా గర్జించిన ఏకైక పార్టీ సీపీఐ అని అన్నారు. 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన సీపీఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా 2024 డిసెంబర్ 26న శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, వాటి ముగింపుగా జనవరి 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు దేశ నలుమూలల నుంచే కాకుండా ప్రపంచంలోని 40 దేశాల ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు.తెలంగాణ ప్రాంతంలో సీపీఐ నేతృత్వంలో సాగిన సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తికై నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటం చరిత్రత్మకమైన ఉద్యమమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ చిట్యాల మండల కార్యదర్శి ఎండి. అక్బర్, సహాయ కార్యదర్శి జిల్లా సత్యం, చిట్యాల పట్టణ కార్యదర్శి ఎస్.కె. షరీఫ్, సీనియర్ నాయకులు దేశగాని బాలరాజు, గుండాల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలి

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News