Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:42 PM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన:మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

03-01-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ :నారాయణఖేడ్ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్)ద్వారా మంజూరైన చెక్కులను నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి అందజేశారు. పేద ప్రజలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగకరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కల్హేర్ మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన వడ్ల నవీతకు రూ.15,000, కంగ్టి మండలం ఎడ్ల రేగడి తాండకు చెందిన లక్ష్మీ బాయికి రూ.9,000, కంగ్టి మండలం చాప్ట్ (K) గ్రామానికి చెందిన లింగాయత్ శివనాథ్‌కు రూ.18,000, కంగ్టి మండలం రాసోల్ గ్రామానికి చెందిన పవన్ కుమార్‌కు రూ.25,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.‌ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్యం అనుకోని ఆర్థిక భారంగా మారుతుందని,అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రజలకు గొప్ప ఊరట కలిగిస్తుందని అన్నారు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల మాజీ ప్రజా ప్రతినిధులు,గ్రామ సర్పంచులు,ఉపసర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన:మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News