Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:52 PM

సీఎం ఆర్ఎస్ లబ్ధిదారులకు సహాయ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

03-01-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట :

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి లబ్ధిదారులకు వైద్య సహాయ చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గం వ్యాప్తంగా ఇటీవల వివిధ రకాల ప్రమాదాలు, అనారోగ్య సమస్యలతో బాధపడి వైద్య సేవలు పొందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సహాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.

శనివారం రోజున మొత్తం 86 మంది లబ్ధిదారులకు సంబంధిత వైద్య సహాయ చెక్కులను జగదీష్ రెడ్డి అందజేశారు. ఆపద సమయంలో ప్రభుత్వం అండగా నిలవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని అన్నారు. వైద్య ఖర్చుల భారం వల్ల ఏ కుటుంబం ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ఈ సహాయం అందిస్తున్నామని స్పష్టం చేశారు.

ప్రజా ప్రతినిధిగా ఎల్లప్పుడూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా తనవంతు ప్రయత్నం కొనసాగిస్తానని జగదీష్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. సహాయ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు జగదీష్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

సీఎం ఆర్ఎస్ లబ్ధిదారులకు సహాయ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News