Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

సదాశివపేట మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఘణపురం చంద్రశేఖర్ ప్రకటన

Updated : 08 Feb 2026 19:21 IST
As Preferred Source 1 min read
సదాశివపేట మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఘణపురం చంద్రశేఖర్ ప్రకటన

సంగారెడ్డి జిల్లా

సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డుకు సంబంధించి ఘణపురం చంద్రశేఖర్ కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన పరిచయాన్ని వెల్లడిస్తూ, గత పది సంవత్సరాలుగా అదే వార్డులో నివసిస్తూ ప్రజల సమస్యలను దగ్గర నుంచి తెలుసుకుంటూ సాధ్యమైనంత వరకు పరిష్కారానికి తోడ్పడుతూ వచ్చానని తెలిపారు.పార్టీ పదవి ఉన్నా లేకపోయినా తాగునీటి సమస్య, పరిశుభ్రత, రోడ్ల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో ప్రజల తరపున అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నిరంతరం ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. అవకాశం లభిస్తే కౌన్సిలర్‌గా అధికారిక బాధ్యతలు స్వీకరించి వార్డు సమస్యలకు స్థిరమైన పరిష్కారాలు చూపించి 10వ వార్డును ఆదర్శ వార్డుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలిపారు.అలాగే వార్డులో నివసించే ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భద్రత కల్పించే దిశగా ఘణపురం యశ్వంతరావు ఆరోగ్య సేవా సంస్థ ద్వారా గ్రూప్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించే ప్రతిపాదనను వెల్లడించారు. ప్రజాసేవే తన ప్రధాన ఆశయమని, పదవులకంటే ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తానని ఆయన పేర్కొన్నారు.

Sthanikam

సదాశివపేట మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఘణపురం చంద్రశేఖర్ ప్రకటన

Article Image

సంగారెడ్డి జిల్లా

సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డుకు సంబంధించి ఘణపురం చంద్రశేఖర్ కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన పరిచయాన్ని వెల్లడిస్తూ, గత పది సంవత్సరాలుగా అదే వార్డులో నివసిస్తూ ప్రజల సమస్యలను దగ్గర నుంచి తెలుసుకుంటూ సాధ్యమైనంత వరకు పరిష్కారానికి తోడ్పడుతూ వచ్చానని తెలిపారు.పార్టీ పదవి ఉన్నా లేకపోయినా తాగునీటి సమస్య, పరిశుభ్రత, రోడ్ల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో ప్రజల తరపున అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నిరంతరం ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. అవకాశం లభిస్తే కౌన్సిలర్‌గా అధికారిక బాధ్యతలు స్వీకరించి వార్డు సమస్యలకు స్థిరమైన పరిష్కారాలు చూపించి 10వ వార్డును ఆదర్శ వార్డుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలిపారు.అలాగే వార్డులో నివసించే ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భద్రత కల్పించే దిశగా ఘణపురం యశ్వంతరావు ఆరోగ్య సేవా సంస్థ ద్వారా గ్రూప్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించే ప్రతిపాదనను వెల్లడించారు. ప్రజాసేవే తన ప్రధాన ఆశయమని, పదవులకంటే ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తానని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి