Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:25 AM

సావిత్రిబాయి ఫూలే జయంతి, సైబర్ మోసాలపై అవగాహన

03-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హయత్‌నగర్, జనవరి 3 (స్థానిక ప్రతినిధి)

ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో మహిళా సాధికారత సెల్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు.

కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్‌బాబు మాట్లాడుతూ సమాజంలో మహిళా విద్యకు బాటలు వేసిన సావిత్రిబాయి ఫూలే సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రొఫెసర్ నాగేంద్ర 1848లో భిదేవాడలో తొలి మహిళా పాఠశాల ప్రారంభించి అణగారిన వర్గాల బాలికలకు విద్య అందించిన త్యాగాన్ని గుర్తుచేశారు.

డా. గీతా నాయక్ విద్య ద్వారానే సమానత్వం సాధ్యమని, మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమన్నారు. మహిళా సాధికారత సెల్ కోఆర్డినేటర్ డా. అపర్ణ చతుర్వేది మహిళా విద్య కోసం సావిత్రిబాయి ఎదుర్కొన్న అడ్డంకులు, పోరాటాలను వివరించారు. ఈ సందర్భంగా అర్షియా (బీకాం–సీఏ) సావిత్రిబాయి ఫూలే వేషధారణలో సందేశం ఇచ్చింది.

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ సహకారంతో ‘ఫ్రాడ్‌కు ఫుల్‌స్టాప్’ కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌హెచ్‌వో నాగరాజు గౌడ్, ఎస్‌ఐ సంతోష్‌కుమార్ సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ, మోసాలు జరిగిన వెంటనే 1930కు ఫోన్ చేయాలని, సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

అలాగే కళాశాల గ్రంథాలయానికి సంస్కృత గెస్ట్ లెక్చరర్ సుభాషిణి రూ.6 వేల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలను విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, ఐసీసీ కన్వీనర్ డా. అనిత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

సావిత్రిబాయి ఫూలే జయంతి, సైబర్ మోసాలపై అవగాహన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News