Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:35 AM

సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ శ్రీనివాసులు గౌడ్

03-01-2026 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నేటి తరానికి వెలుగునిచ్చిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే

రామన్నపేట స్థానికం ప్రతినిధి

దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన సావిత్రిబాయి పూలే నేటి తరానికి వెలుగునిచ్చిన మహానీయురాలని గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు గౌడ్ పేర్కొన్నారు. మండలంలోని పల్లివాడ గ్రామంలో శనివారం గ్రామ పంచాయతీ ఆవరణలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, మహిళలకు చదువు నేరంగా భావించిన కాలంలో ధైర్యంగా విద్యను ఆయుధంగా చేసుకొని సమాజ మార్పుకు పూనుకున్న విప్లవాత్మక వ్యక్తిత్వం సావిత్రిబాయి పూలేనని అన్నారు. ఆమె చూపిన పోరాట స్ఫూర్తిని నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు.

అంతకుముందు కామినేని ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును సర్పంచ్ ప్రారంభించారు. ఈ శిబిరంలో కామినేని ఆసుపత్రి నుంచి వచ్చిన కంటి వైద్యులు, ఎముకల వైద్యులు, జనరల్ వైద్య నిపుణులు పాల్గొని బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్ అవసరమైన రోగులను సోమవారం కామినేని ఆసుపత్రికి తరలిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు, ఉపసర్పంచ్ పావిరాల మత్స్యగిరి, వార్డు సభ్యులు కంబాలపల్లి మధు, గట్టు ఉపేందర్, కర్రే లావణ్య, జనపాల కవిత, నరసింహ, కర్రే శ్రీనివాస్, బెలిజ నరసింహ, కంకణాల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ శ్రీనివాసులు గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News