Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

రుద్రవెల్లి మూసీ బ్రిడ్జికి రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలి

16-03-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి

దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న రుద్రవెల్లి మూసీ బ్రిడ్జికి జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ మేరకు సోమవారం రోజున బీబీనగర్ తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ భగత్ కు సిపిఎం నాయకులు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ...గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనులు చేపట్టి అర్ధాంతరంగా వదిలేసిన మూసీ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేయుటకు అధికారంలోకి వచ్చి మూడవ బడ్జెట్ ప్రవేశపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావలసిన నిధులు కేటాయించాలని అన్నారు.హైదరాబాద్ లో తేలికపాటి వర్షాలు పడితే చాలు బీబీనగర్ నుండి పోచంపల్లికి వెళ్లేందుకు రాకపోకలు బంద్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి బంద్ కావడంతో చుట్టూ తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తుందని అన్నారు. ప్రజల రవాణా సౌకర్యార్థం కోసం తక్షణమే బడ్జెట్ లో నిధులు కేటాయించి మూసీ బ్రిడ్జి పనులను పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల అవస్థలను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.స్థానిక ఎమ్మెల్యే,ఎంపీలు బాధ్యత వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు కేటాయింపచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బండారు శ్రవణ్ కుమార్ నాయకులు లోకదాసు పవన్,కుమ్మరి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రుద్రవెల్లి మూసీ బ్రిడ్జికి రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News