చౌటుప్పల్: రాచకొండ నార్కొటిక్స్ బృందం, చౌటుప్పల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం పంతంగి టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టగా, కారులో అక్రమంగా తరలిస్తున్న 431 కిలోల గంజాయిని గుర్తించి పట్టుకున్నారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.2.20 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఘటనలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రాథమిక విచారణలో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన రాకేష్ వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి