Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:20 AM

రూ.10 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

రూ.10 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

రూ.10 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
16-05-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కొమురవెల్లి, అధికారిక పని చేసేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి గడ్డం రాజు గౌడ్, సర్పంచ్ గొల్లపల్లి పద్మ భర్త గొల్లపల్లి అంజనేయులు ఏసీబీ అధికారులకు చిక్కారు.

ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్లాట్‌లో వేసిన డ్రైనేజీ పైప్‌లైన్‌ను తొలగించేందుకు కార్యదర్శి రూ.10 వేల లంచం కోరాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.

పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన అధికారులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో దాడి నిర్వహించారు. కార్యదర్శి సూచనల మేరకు సర్పంచ్ భర్త అంజనేయులు లంచం నగదు స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

రూ.10 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Article Image

కొమురవెల్లి, అధికారిక పని చేసేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి గడ్డం రాజు గౌడ్, సర్పంచ్ గొల్లపల్లి పద్మ భర్త గొల్లపల్లి అంజనేయులు ఏసీబీ అధికారులకు చిక్కారు.

ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్లాట్‌లో వేసిన డ్రైనేజీ పైప్‌లైన్‌ను తొలగించేందుకు కార్యదర్శి రూ.10 వేల లంచం కోరాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.

పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన అధికారులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో దాడి నిర్వహించారు. కార్యదర్శి సూచనల మేరకు సర్పంచ్ భర్త అంజనేయులు లంచం నగదు స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News