Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:10 PM

రోకలితో భార్య హత్య… వరంగల్‌లో దారుణం

రోకలితో భార్య హత్య… వరంగల్‌లో దారుణం

రోకలితో భార్య హత్య… వరంగల్‌లో దారుణం
10-03-2026 839 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వరంగల్: నగరంలోని 14వ డివిజన్ ఎస్‌ఆర్ నగర్‌లో సోమవారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ చివరకు హత్యకు దారి తీసింది.

పోలీసుల వివరాల ప్రకారం.. అబ్బరబోయిన రాజు, అనిత(40) దంపతులు. సోమవారం అనిత తన చిన్ననాన్న కర్మ కార్యక్రమానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది.

కోపంతో ఆగ్రహానికి లోనైన రాజు ఇంట్లో ఉన్న రోకలితో అనిత తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అనిత మృతి చెందింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Sthanikam

రోకలితో భార్య హత్య… వరంగల్‌లో దారుణం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News