Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 09:31 PM

రోజుకో రూపాయి… రూ.8 కోట్ల స్కూల్ భవనం

రోజుకో రూపాయి… రూ.8 కోట్ల స్కూల్ భవనం

రోజుకో రూపాయి… రూ.8 కోట్ల స్కూల్ భవనం
08-02-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పొదుపు మహిళల సంకల్పానికి నిలువెత్తు సాక్ష్యం

కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా బాలభారతి విద్యాలయం

కర్నూలు జిల్లా:

రోజుకు రూపాయి పొదుపుతో కోట్ల విలువైన స్కూల్ భవనాన్ని నిర్మించడం అసాధ్యమనే భావనను సవాల్ చేస్తూ డ్వాక్రా పొదుపు మహిళలు ఓ అద్భుతాన్ని సృష్టించారు. అక్షరం ముక్క కూడా రాని వేలాది మహిళల సంకల్ప బలమే ఈ రోజు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా నిలిచే బాలభారతి స్కూల్ భవనం రూపుదిద్దుకోవడానికి కారణమైంది.పిల్లలను పెద్ద కార్పొరేట్ స్కూళ్లలో చదివించాలని అనుకున్నా ఆర్థిక స్థోమత లేని మహిళలు, వెనక్కి తగ్గలేదు. వేరే స్కూళ్లకు పంపలేకపోతే మనమే ఒక మంచి స్కూల్ నిర్మించుకుందామనే ఆలోచనతో ముందడుగు వేశారు. మాటలకే పరిమితం కాకుండా దానిని కార్యరూపం దాల్చేలా చేశారు.రూపాయి రూపాయి పొదుపు చేస్తూ, ఇటుక ఇటుక పేర్చుతూ, చెమటోడ్చి ఎనిమిదేళ్ల పాటు చేసిన కష్టానికి ఫలితమే ఈ రోజు మహారాజు ప్యాలెస్‌ను తలపించే స్కూల్ భవనం. సుమారు పది వేలమంది పొదుపు మహిళల శ్రమశక్తితో నిర్మితమైన ఈ భవనం ఇప్పుడు రెండు అంతస్తులతో విద్యార్థులకు విద్యానందిస్తోంది. మూడో అంతస్తు నిర్మాణం కూడా త్వరలో పూర్తి చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.తమకు చదువు లేకపోయినా కనీసం తమ పిల్లలైనా మంచి విద్యతో ముందుకు వెళ్లాలనే తపనే ఈ ఉద్యమానికి బీజం వేసింది. పేదరికం అడ్డంకి కాదని, ఐక్యతతో ఏదైనా సాధ్యమని నిరూపిస్తూ బాలభారతి స్కూల్ నేడు రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోంది.ఈ స్కూల్ కేవలం ఒక భవనం కాదు. పొదుపు మహిళల ఆశల ప్రతిబింబం,విద్యపై వారి అపార విశ్వాసానికి సజీవ నిదర్శనం.

Sthanikam

రోజుకో రూపాయి… రూ.8 కోట్ల స్కూల్ భవనం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News