Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:42 AM

రోడ్డు ప్రమాదాల నివారణకే ‘అరైవ్ – ఎలైవ్’ కార్యక్రమం

12-01-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అరైవ్ – ఎలైవ్ కరపత్రం ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

సకాలంలో స్పందిస్తే ‘రహదారి హీరో’గా గుర్తింపు – నగదు ప్రోత్సాహం

సూర్యాపేట:

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించిన ‘అరైవ్ – ఎలైవ్’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లి రోడ్డు భద్రత పట్ల చైతన్యం కల్పిస్తామని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు తెలిపారు.

రోడ్డు భద్రత మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవిలతో కలిసి అరైవ్ – ఎలైవ్ అవగాహన కరపత్రాన్ని ఎస్పీ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ

రోడ్డు ప్రమాదాల నిర్మూలనకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు, పౌరులను ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. రోడ్డు భద్రత, రోడ్డు నియమ నిబంధనలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో పౌరులు బాధ్యతగా వ్యవహరించాలని,

ప్రమాద ప్రాంతంలో ఉన్నవారు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి, పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించాలి,

క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రికి తరలించాలని పిలుపునిచ్చారు. ఇలా స్పందించి ప్రాణాలు కాపాడిన వారిని ‘రహదారి హీరో’గా గుర్తించి నగదు ప్రోత్సాహం అందిస్తామని ఎస్పీ తెలిపారు. అనంతరం పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించిన ఎస్పీ, అరైవ్ – ఎలైవ్ కార్యక్రమం ఉద్దేశ్యం, లక్ష్యాలను వివరించారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు ప్రతి కాలనీకి, ప్రతి గల్లీకి, ప్రతి గ్రామానికి, ప్రతి విద్యార్థి, ప్రతి పౌరునికి చేరేలా పోలీసులు పనిచేయాలని ఆదేశించారు. సూర్యాపేట, కోదాడ మున్సిపాలిటీ కేంద్రాల్లో వార్డుల వారీగా రోడ్డు భద్రత కమిటీలు, మండల పరిధిలో గ్రామాల వారీగా రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఒక్కరి ప్రాణం కూడా పోకుండా చూడటమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలోఅదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి,

డీసీఆర్బీ డీఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు,సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు,ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు ప్రమాదాల నివారణకే ‘అరైవ్ – ఎలైవ్’ కార్యక్రమం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News