Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తడ్కల్‌లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు.. భారీ ర్యాలీలో పాల్గొన్న యువత, ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:38 PM

రోడ్డు భద్రత పట్ల ఉద్యోగులు, పౌరులను ప్రభావితం చేయాలి

16-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

డీఎస్పీ ప్రసన్న కుమార్

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్డు భద్రత మహోత్సవాలు, పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ ఎలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సూర్యాపేట పట్టణ మున్సిపల్ కార్యాలయంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణ, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువగా ప్రాణనష్టాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించడంలో ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రోడ్డు భద్రత పట్ల సామాన్య ప్రజలు, పౌరులు, యువతను ప్రభుత్వ ఉద్యోగులు ప్రభావితం చేయాలని కోరారు.

ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అధిక వేగంతో వాహనాలు నడపరాదని స్పష్టం చేశారు. పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్డు భద్రత కార్యక్రమాలను ఉద్యమంలా తీసుకెళ్లాలని, ఉద్యోగులు, పౌరులు ఇందులో భాగస్వాములై బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వారితో రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహితంగా వాహనాలు నడుపుతామని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, ఎంఈఓ శ్రీనివాస్, ఆర్‌ఎంఓ లక్ష్మణ్, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, టౌన్ ఎస్ఐలు మహేంద్రనాథ్, శివతేజ, ఐలయ్య, ఏఎంవీఐ విక్రమ్, ఏఎంవీఐ సంపత్‌తో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రత పట్ల ఉద్యోగులు, పౌరులను ప్రభావితం చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News