Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:01 AM

రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని పకడ్బందీ చర్యలు చేపట్టాలి

రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని పకడ్బందీ చర్యలు చేపట్టాలి

రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని పకడ్బందీ చర్యలు చేపట్టాలి
February 20, 2026 08:02 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యదాద్రి భువనగిరి:రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించి ప్రజల ప్రాణాలను రక్షించడం కోసం జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రోజు కలెక్టరేట్ మినీ మీటింగ్ హాలులో జిల్లాలో రోడ్డు భద్రతాపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ఈ మధ్యకాలంలో జిల్లాలో జరిగిన ప్రమాదాలకు గల కారణాలు అడిగి తెలుసుకుని వాటిని గుర్తించి ఆ ప్రదేశాల్లో మళ్లీ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సాధించాలని ఆదేశించారు. జిల్లాలో ప్రధాన రహదారులపై స్పీడ్ గల్స్ ఏర్పాటు చేసి,స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో మైనర్ బాలుర డ్రైవింగ్ ని కట్టడి చేసి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయాలని తెలిపారు. జిల్లాలో ఉన్న పాఠశాల బస్సులు అన్ని కండిషన్లు ఉన్నాయా లేవా అని చెక్ చేసి లేని వాటిని చేయాలని సూచించారు.యాక్సిడెంట్ రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత సమావేశంలో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టారు,జిల్లాలో ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి వాటిపై తీసుకున్న చర్యలు ఏమిటని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ప్రదేశాలలో సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నేషనల్ హైవే అథారిటీ, పంచాయతీరాజ్,మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రోడ్ సేఫ్టీ సమావేశాల్లో చర్చించిన అంశాలకు సంబంధించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ మాట్లాడుతూ...జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి తగు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.అతివేగంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు, స్పీడ్ గన్స్‌తో తనిఖీలు మద్యం సేవించి వాహనం నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుందని,హెల్మెట్,సీట్ బెల్ట్ తప్పనిసరి ఉల్లంఘనలకు జరిమానాలు విధించి,బ్లాక్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు,స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ,ట్రాఫిక్ ఏసిపి ప్రభాకర్ రెడ్డి,రోడ్డు భవనాల శాఖ అధికారి సరిత,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News