Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:19 AM

రోడ్డు ప్రమాద బాధితుడికి రికార్డు స్థాయిలో పరిహారం.. ఏకంగా రూ.2.95 కోట్లు చెల్లించాలని కోర్టు తీర్పు!

21-02-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ నేత కుటుంబానికి రికార్డు స్థాయిలో పరిహారం చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీని కర్నూలు కోర్టు ఆదేశించింది. కర్నూలుకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఎదురూరు రాజవర్ధన్ రెడ్డి 2022 ఏప్రిల్ 20న హైదరాబాదు నుంచి కర్నూలుకు ఫార్చ్యూనర్ కారులో వస్తుండగా మహబూబ్నగర్ జిల్లాలోని ఉండవల్లి దగ్గర రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య పులకుర్తి సౌజన్య, తండ్రి విష్ణువర్ధన్ రెడ్డి ఉండవల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు.

  1. రాజ వర్ధన్ రెడ్డి భార్య పిల్లలు తమ సీనియర్ న్యాయవాది ఎంఎల్ శ్రీనివాసరెడ్డి ద్వారా కర్నూలు జిల్లా కోర్టులో నష్టపరిహారం కోసం కేసు దాఖలు చేశారు. సదరు కారుకు లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా చేయించి ఉండటంతో వారు ఇన్సూరెన్స్ కంపెనీ నష్టపరిహారం చెల్లించాలని కోర్టును కోరారు. ఈ మేరకు కోర్టు సాక్ష్యధారాలు పరిశీలించి మృతుడి వయస్సు, ఆదాయము, విద్యార్హతలు కుటుంబీకుల స్థితిగతులను పరిగణలోకి తీసుకుని ఆ కంపెనీ మృతుని కుటుంబీకులకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది._
  2. పిటిషనర్లైన మృతుని కుటుంబ సభ్యులకు రూ.2.2 కోట్లు తోపాటు 7.5 శాతం వడ్డీతో సహా మొత్తం రూ.2.95 కోట్లు చెల్లించాలని ఏడవ అదనపు జిల్లా న్యాయమూర్తి లక్ష్మీరాజ్యం తీర్పు చెప్పారు. ఇంత మొత్తంలో పరిహారం రావడం పట్ల మృతుడు రాజ వర్ధన్ రెడ్డి కుటుంబీకులు తమ న్యాయవాది ఎంఎల్ శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మధ్యకాలంలో ఇంత భారీ మొత్తం నష్టపరిహారం చెల్లించమని ఒక భీమా కంపెనీకి కోర్టు ఆదేశించలేదని, ఇదే ప్రధమమని పలువురు న్యాయవాదులు చెబుతున్నారు.
Sthanikam

రోడ్డు ప్రమాద బాధితుడికి రికార్డు స్థాయిలో పరిహారం.. ఏకంగా రూ.2.95 కోట్లు చెల్లించాలని కోర్టు తీర్పు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News