Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:44 PM

రోడ్డు భద్రతపై నిర్లక్ష్యం వద్దు

రోడ్డు భద్రతపై నిర్లక్ష్యం వద్దు

రోడ్డు భద్రతపై నిర్లక్ష్యం వద్దు
January 29, 2026 05:01 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలి – జిల్లా ఎస్పీ కె నరసింహ

సూర్యాపేట

రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమ నిబంధనలను కచ్చితంగా పాటించడంపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో భాగంగా గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎమ్మెస్సార్ పాఠశాల విద్యార్థులతో కలిసి హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ ధరించడం, అతివేగ నియంత్రణపై రూపొందించిన పోస్టర్లు, స్టిక్కర్లను ఎస్పీ ఆవిష్కరించారు.విద్యార్థుల అవగాహన కార్యక్రమం ప్రశంసనీయంప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలనే లక్ష్యంతో విద్యార్థులు చేపట్టిన అవగాహన కార్యక్రమం అభినందనీయమని ఎస్పీ కొనియాడారు. చిన్న వయస్సు నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉంటే రోడ్డు ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చని స్పష్టం చేశారు.శ్రమతోనే విజయాలు సాధ్యం

విద్యార్థులు నిరంతరం శ్రమిస్తూ కష్టపడి చదవాలని, ఉన్నత ఆశయాలతో ముందుకు సాగాలని ఎస్పీ సూచించారు. నిత్యం కష్టపడే వ్యక్తి తన కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడతాడని తెలిపారు.ఇంటి నుంచే రోడ్డు భద్రతకు శ్రీకారం రోడ్డు భద్రత అవగాహన ఇంటి నుంచే ప్రారంభం కావాలని, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే తల్లిదండ్రులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా విద్యార్థులు గుర్తు చేయాలని సూచించారు. అలాగే కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించాల్సిన అవసరాన్ని ఇంటి పెద్దలకు వివరించాలని అన్నారు.

తల్లిదండ్రుల గౌరవం పిల్లల ప్రధాన బాధ్యత తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలతో సమానమని, వారిని గౌరవిస్తూ వారి ఆశయాలను నెరవేర్చడం పిల్లల ప్రధాన బాధ్యత అని ఎస్పీ హితవు పలికారు. మంచి, చెడు విషయాలపై స్పష్టమైన అవగాహనతో జీవన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు.

వేధింపులపై సహించకుండా ఫిర్యాదు చేయాలి విద్యార్థులు ఎలాంటి వేధింపులకు గురైనా మౌనంగా ఉండకుండా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. సమస్యను ప్రారంభ దశలోనే అణిచివేస్తే తీవ్ర పరిణామాలను నివారించవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ట్రాఫిక్ నియమాలపై కఠినంగా అమలు

ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను తూచా తప్పకుండా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. ప్రమాద రహిత జిల్లాగా సూర్యాపేటను తీర్చిదిద్దడం అధికారులతో పాటు ప్రజలందరి బాధ్యత అని స్పష్టం చేశారు.కార్యక్రమంలో పలువురు అధికారులుఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆదిత్య, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎమ్మెస్సార్ పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్, అధికారులు, పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధాన కూడళ్లలో అవగాహన ర్యాలీ కార్యక్రమం అనంతరం విద్యార్థులు సూర్యాపేట పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించాలంటూ స్టిక్కర్లు అంటిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం పట్టణ ప్రజల్లో మంచి స్పందన పొందింది.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News