Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:08 PM

రోడ్డు భద్రతకు ప్రాధాన్యం – గొర్రెకల్‌లో ఇరువైపులా గడ్డి తొలగింపు కార్యక్రమం

23-01-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ :వట్‌పల్లి మండలం పరిధిలో గొర్రెకల్ గ్రామ పంచాయతీ పరిధిలో పరిశుభ్రతతో పాటు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా, గొర్రెకల్ నుండి నాగులపల్లి వరకు మరియు గొర్రెకల్ నుండి వట్‌పల్లి వరకు ఉన్న ప్రధాన రహదారుల ఇరు వైపులా పెరిగిన పిచ్చి మొక్కలు, గడ్డి మరియు మూల పొదలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డు ఇరువైపులా గడ్డి, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించడంతో పాటు, ముఖ్యంగా మూల మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ గడ్డి మరియు మూల పొదల కారణంగా గతంలో అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని, కొందరు ప్రాణాలు కూడా కోల్పోయిన బాధాకర సంఘటనలు ఉన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే రాత్రి వేళల్లో పందులు ఈ గడ్డిలో నుంచి గుంపులుగా అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు పెరిగిన నేపథ్యంలో, ఈ సమస్యను గ్రామ ప్రజలు సర్పంచ్ గారి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సర్పంచ్ గారు వెంటనే చర్యలు చేపట్టి, రోడ్డు ఇరువైపులా ఉన్న గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించే పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గొర్రెకల్ గ్రామ సర్పంచ్ శ్రీ లింగారెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు పోలీస్ శేఖర్ పటేల్, బోయిని సత్యం, తిరుపతి శ్రీనివాస్ రెడ్డి, కాడారి కృష్ణా గౌడ్ లతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని, పనులను పర్యవేక్షించారు. గ్రామ పంచాయతీ చేపట్టిన ఈ చర్యలతో రోడ్డు భద్రత మరింత మెరుగుపడుతుందని, వాహనదారులకు మరియు గ్రామస్తులకు ఉపశమనం కలుగుతుందని పాల్గొన్నవారు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని గ్రామస్తులు కోరారు.

Sthanikam

రోడ్డు భద్రతకు ప్రాధాన్యం – గొర్రెకల్‌లో ఇరువైపులా గడ్డి తొలగింపు కార్యక్రమం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News